మీ మీద ఇతరులు ఆసక్తి కనబరచాలని మీరు కోరుకునేటట్లయితే ఎదుటివారి మీద మీరు ఆసక్తి కనబరచండి.ఎదుటివారు జవాబులు చెప్పటానికి ఇష్టపడే ప్రశ్నలే వారిని అడగండి.వాళ్ల గురించి ,వాళ్లు సాధించిన వాటి గురించి మాట్లాడేటట్లు ప్రోత్సహించండి.
మీతో మాట్లాడే వ్యక్తులకి తమ మీదా ,తమ ఇష్టాయిష్టాల మీద తమ సమస్యల మీదా ఉన్న ఆసక్తి మీ మీదా,మీ సమస్యల మీదా ఉండదని గుర్తుంచుకోండి.ఈసారి మీరు ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభించే ముందు ఈ విషయం కాస్త ఆలోచించండి.
చక్కగా వినండి.ఎదుటివారిని తమగురించి చెప్పమని ప్రోత్సహించండి.ఇది మీరు మంచి వక్తగా రూపొందటానికి ఒక సులభమైన మార్గం.
ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది. మనలోనుంచి పుట్టిన సమస్యకు సమాధానం కూడా మనలోనే ఉంది. ప్రతి సమస్యకు మూలాన్ని కనుక్కోగలిగితే ఆ సమస్య బాధ కలిగించేది కాకుండా మన అభివృద్ధికి కారణమవుతుంది. THINK WITH SMILE-DO WITH SMILE-TALK WITH SMILE-THEN YOU WILL GET SMILES EVERY WHERE.