భగవంతుడిచ్చిన వరం ఆనందం. దాన్ని చిన్న చిన్న కారణాలకు,సమస్యలకు,ఆవేశాలకు,ఆవేదనలకు మరియు మానసికఒత్తిడులకు కోల్పోకూడదు.చిన్న చిన్న అనే పదాన్ని ఎందుకు వడానంటే అవి ఎంత పెద్దవైనా జీవితంముందు,ఆనందం ముందు చాలా చిన్నవే. ముఖంపై చిరునవ్వు చిందించడం అంటే దైవాన్ని ప్రార్థించడమే.
మీ దుఃఖానికి ఎవరో ఎదుటివాళ్ళు కారణమనిచెప్పి ,వాళ్ళపై తప్పును మోపడానికి ప్రయత్నించకండి.మీ దుఃఖానికి మీరే కారణమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.మీ దుఃఖాల లోతులకెళ్ళి, దీనినుండి నేను నేర్చుకోగల పాఠం ఏమిటి అన్న విషయం ఆలోచించండి.ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయండి.అదే మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది.
ఆనందం అనేది తాళం కప్పలాంటిది.వివేకం తాళం చెవి వంటిది.తాళం చెవిని ఒకవైపుకి తిప్పితే ఆనందం తలుపులు మూసుకుపోతాయి.మరోవైపుకు తిప్పినట్టయితే ఆనందం తలుపులు తెరుచుకుంటాయి.
ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది. మనలోనుంచి పుట్టిన సమస్యకు సమాధానం కూడా మనలోనే ఉంది. ప్రతి సమస్యకు మూలాన్ని కనుక్కోగలిగితే ఆ సమస్య బాధ కలిగించేది కాకుండా మన అభివృద్ధికి కారణమవుతుంది. THINK WITH SMILE-DO WITH SMILE-TALK WITH SMILE-THEN YOU WILL GET SMILES EVERY WHERE.
బ్లాగు ఆర్కైవ్
-
▼
2008
(7)
-
▼
డిసెంబర్
(7)
- మన దైనందిన జీవితంలో పూర్తిగా విస్మరించబడిన ఒక గొప్...
- Think with Smile-Do with Smile-Then you will get S...
- విమర్శవల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.ఎందుకంటే విమర్శ ...
- 4).మీరేదో సాధించటానికి పుట్టారు. అదేమిటో ముందు కను...
- 3).మీరు శారీరకంగా అందంగా లేకపోతే దాన్ని మీ వ్యక్తి...
- గతాన్ని గురించి కలవరపడకుండా,భవిష్యత్తు గురించి ఆంద...
- సుస్వాగతం
-
▼
డిసెంబర్
(7)