శనివారం

ఒక్కటి ఇవ్వండి-ఆనందం పొందండి.

జీవితం ఆనందంగా,ప్రశాంతంగా ఉండాలంటే ఇవ్వటం నేర్చుకోవాలి.ఇవ్వటం అంటే ఎంతో కాదు మన సంపాదనలో”ఒక్క శాతం’ పేదవారికి . మనం మాట్లాడే మాటల్లో ’ఒక్క మాట’ ఎదుటివారికి ఆనందం కలిగించేది. మనం చేసే పనుల్లో ’ఒక్కపని” బలహీనులకు ఉపయోగపడేది.మనం చూసే చూపుల్లో ”ఒక్కచూపు’ బాధల్లో ఉన్నవారికి భరోసా ఇచ్చేది .మనం ఉండే చోటుల్లో’ ’ఒక్కచోటు” మనచుట్టూ ఉండేవారికి మనమంటే భయం కలగకుండా ఉండేది.మనం ప్రార్థన చేసే క్షణాల్లో ఒక్కక్షణం తోటివారి క్షేమం కొరకుచేసేది. ఇలా ఒక్కొక్కటి ఇవ్వడం నేర్చుకుంటే ఆనందం మన వెంటే ఉంటుంది.
సర్వే జనః సుఖినో భవంతు!!

కామెంట్‌లు లేవు: