ఆదివారం

చిదంబర రహస్యం-జీవితం!!

ఎవ్వరికీ అర్థం కానిది.అందరికీ అర్థమైనట్లు అనిపించేది.శాశ్వతమైనది.అశాశ్వతంగా కనిపించేది.వేల సంవత్సరాలుగా వెతుకుతున్నది.మనతోనే ఉండేది.మనలోనే ఉండేది.కాలంతో పాటు పయనించేది.గతంలో ఉన్నది.ఇప్పుడు కొనసాగుతున్నది.భవిష్యత్తులో ఉండేది.అశాశ్వతమైన వాటిలో జీవాన్ని నింపేది.తాను అశాశ్వతంగా ఉన్నట్లు అగుపించేది.తాను మారకుండా అన్నింటినీ మార్చేది.ఆనంద స్వరూపమైనది.అన్నింటికీ అతీతమైనది.ఉన్నదాంతో తృప్తి చెందనిది.ఉండాలనుకునే దానివెంట పరుగెత్తేది.తానే ఆనందమని మరచి ,ఆనందం కోసం వెతికేది.అద్భుతమైనది,కానీ అల్పంగా తోచేది.