శుక్రవారం

అహం!!!.

ప్రతి పనిని తనే సంకల్పించి తనే చేస్తున్నాడు అనుకోవడం "అహం".ఈ విశాల విశ్వంలో తను చేసే ప్రతి పని వెనుక ఏదో అదృశ్య శక్తి ఉంది,తన చేత చేయిస్తోంది అన్న విషయాన్ని విస్మరించడమే అహం.ప్రతీ మనిషి సాధారణంగా దయాస్వభావంతోనే పుడతాడు.వయసుతో పాటు పెరిగే అహంవల్ల తను ఇతరుల కన్నా మెరుగు అనుకొని ఈ దయా స్వభావాన్ని విడిచి పెడతాడు.మనలోని రాగ-ద్వేషాలు,సుఖం-దుఃఖం,ఇష్టాయిష్టాలు మొదలైన అనేక ద్వంద్వభావానల ఉత్పత్తికి కూడా ఈ అహమే అసలు కారణం.మనల్ని ఎవరైనా ఏదైనా మాటంటే,మన అహం దెబ్బ తినడం వల్లే మనకి కోపం వస్తుంది.తిరిగి మనం ఇంకో మాటంటేగాని దెబ్బతిన్న మన అహం శాంతించదు.అహం మనిషిని వివేకశూన్యునిగా చేస్తుంది.అహాన్ని వదిలితే మనిషి మహాత్ముడు అవుతాడు.
నాలోని "నేను" పోతే, అంతా నేనే-అంతటా నేనే.